వినోదం పంచే ప్రేమగాథ

ABN , Publish Date - Aug 28 , 2024 | 02:27 AM

నారా రోహిత్‌ కథానాయకుడిగా నటించిన ‘సుందరకాండ’ చిత్రం టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని యూనిట్‌ మంగళవారం నిర్వహించింది. తన స్వప్న సుందరి కోసం అన్వేషించే క్రమంలో...

నారా రోహిత్‌ కథానాయకుడిగా నటించిన ‘సుందరకాండ’ చిత్రం టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని యూనిట్‌ మంగళవారం నిర్వహించింది. తన స్వప్న సుందరి కోసం అన్వేషించే క్రమంలో ఆయన పండించిన వినోదం అలరించింది. నారా రోహిత్‌ మాట్లాడుతూ ‘ఇదొక వినూత్న ప్రేమగాథ, నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’ అన్నారు. ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని మా చిత్రం ఇస్తుంది అని దర్శకుడు వెంకటేశ్‌ నిమ్మలపూడి చెప్పారు.

Updated Date - Aug 28 , 2024 | 02:27 AM