Lorry : ఎంటర్‌టైన్‌ చేసే లారీ

ABN , Publish Date - May 18 , 2024 | 05:56 AM

శ్రీకాంత్‌రెడ్డి ఆసం హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లారీ ఛాప్టర్‌ - 1’. చంద్ర శిఖ కథానాయిక. రాఖీ సింగ్‌ కీలకపాత్ర పోషించారు. ఆసం వెంకట లక్ష్మి నిర్మిస్తున్నారు.

Lorry : ఎంటర్‌టైన్‌ చేసే లారీ

శ్రీకాంత్‌రెడ్డి ఆసం హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లారీ ఛాప్టర్‌ - 1’. చంద్ర శిఖ కథానాయిక. రాఖీ సింగ్‌ కీలకపాత్ర పోషించారు. ఆసం వెంకట లక్ష్మి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను యూనిట్‌ గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘డైరెక్షన్‌ కోర్స్‌ చేశాక యూట్యూబ్‌లో వీడియోలు చేశాను. తర్వాత పలు చిత్రాలకు వివిధ విభాగాల్లో సహాయకుడిగా పనిచేసి అనుభవం గడించాను. ఇప్పుడు ‘లారి ఛాప్టర్‌-1’ అనే సినిమాతో హీరోగా వస్తున్నాను. ఇదొక సరికొత్త యాక్షన్‌ ఎంటర్టైనర్‌. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేస్తున్నాం. త్వరలో రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: తాడిపత్రి నాగార్జున.

Updated Date - May 18 , 2024 | 05:56 AM