వినోదాన్ని పంచే పరదా

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:00 AM

‘సినిమా బండి’ చిత్రంతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నారు ప్రవీణ్‌ కాండ్రేగుల. ఆయన దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో

వినోదాన్ని పంచే పరదా

‘సినిమా బండి’ చిత్రంతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నారు ప్రవీణ్‌ కాండ్రేగుల. ఆయన దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పరదా’. విజయ్‌ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్‌ మక్కువ నిర్మాతలు. శనివారం ఫస్ట్‌లుక్‌, కాన్సెప్ట్‌ వీడియోను సమంత, దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ లుక్‌లో ముఖంపై పరదాతో ఉన్న మహిళల మధ్యన అనుపమ నిరాసక్తంగా చూస్తూ కనిపించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌లో చిత్రీకరణ జరిగింది. వచ్చే నెల్లో హైదరాబాద్‌ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. ‘పరదా’తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో పాటు మంచి సందేశం అందిస్తాం’ అని చెప్పారు. ఇదొక కథ మాత్రమే కాదు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయాణం కూడా అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌. సినిమాటోగ్రఫీ: మృదుల్‌ సుజిత్‌ సేన్‌

Updated Date - Apr 27 , 2024 | 12:00 AM