ఎనర్జిటిక్‌ డాన్స్‌ డ్యూయెట్‌

ABN , Publish Date - Jul 15 , 2024 | 02:54 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, సుధాకర్‌ మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు...

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, సుధాకర్‌ మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ ఇందులో కథానాయికగా నటిస్తుండగా, సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ‘దేవర పార్ట్‌ 1’ సెప్టెంబర్‌ 27న విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, ఫస్ట్‌ సింగిల్‌ ‘ఫియర్‌’ సినిమాపై అంచనాలను తారస్థాయిలో పెంచాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకొంటున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చిందని కేవలం రెండు పాటలు.. ఒక కీలక సన్నివేశం మాత్రమే బ్యాలెన్స్‌ ఉన్నాయని చిత్ర బృందం తెలిపింది. అయితే ఈ సినిమాలోని ఓ పాటను హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్స్‌లో రేపటి నుంచి చిత్రీకరించనున్నారని తెలిసింది. ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌ మధ్య సాగే ఈ డాన్స్‌ డ్యూయెట్‌ పాట.. చాలా ఎనర్జిటిక్‌గా ఉండి.. చిత్రానికే స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఉండనుందట.

Updated Date - Jul 15 , 2024 | 02:54 AM