బామ్మను విమర్శించిన వ్యక్తికి అవార్డా?
ABN , Publish Date - Oct 09 , 2024 | 12:57 AM
కర్నాటక గాత్ర విద్వాంసుడు టీఎం కృష్ణకు ఈ యేడాది ‘సంగీత కళానిధి’ అవార్డును ప్రదానం చేయాలని మ్యూజిక్ అకాడమీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దివంగత కర్నాటక సంగీత దిగ్గజం ఎమ్మెస్ సుబ్బలక్ష్మి మనవడు...
కర్నాటక గాత్ర విద్వాంసుడు టీఎం కృష్ణకు ఈ యేడాది ‘సంగీత కళానిధి’ అవార్డును ప్రదానం చేయాలని మ్యూజిక్ అకాడమీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దివంగత కర్నాటక సంగీత దిగ్గజం ఎమ్మెస్ సుబ్బలక్ష్మి మనవడు వి. శ్రీనివాసన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తన బామ్మను తీవ్రంగా విమర్శించడంతో పాటు హేతువాదిగా ఉంటున్న కృష్ణన్‌కు ఆ అవార్డును ప్రదానం చేయడం తగదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని స్మరిస్తూ చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ, ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వాహకులు కలిసి 2005 నుంచి ప్రతియేటా ఆమె పేరుతో సంగీత కళానిధి అవార్డులను ప్రదానం చేయడం ఆనవాయితీ అని, అయితే ఆమెను తీవ్రంగా విమర్శించిన కృష్ణన్‌కు ఈ సారి అవార్డును ప్రదానం చేయకుండా ఉత్తర్వులివ్వాలని పిటిషన్‌లో అభ్యర్థించారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)