నటిగా మారుతున్న కంటెంట్‌ క్రియేటర్‌

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:50 AM

యూట్యూబ్‌, ఇన్‌సాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వీడియోలు, రీల్స్‌ ద్వారా ఫేమస్‌ అయిన కంటెంట్‌ క్రియేటర్‌ నిహారిక ఎన్‌.ఎమ్‌.. నటిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు...

యూట్యూబ్‌, ఇన్‌సాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వీడియోలు, రీల్స్‌ ద్వారా ఫేమస్‌ అయిన కంటెంట్‌ క్రియేటర్‌ నిహారిక ఎన్‌.ఎమ్‌.. నటిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో అల్లు అరవింద్‌ నిర్మించే చిత్రంలో ఆమె నటిస్తున్నారు. గురువారం ఆమె పుట్టినరోజు సందర్భంగా గీతా ఆర్ట్స్‌ సంస్థ నిహారికకు విషెస్‌ తెలుపుతూ సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. ‘అందాల తార నిహారిక ఎన్‌.ఎమ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రేమతో మిమ్మల్ని టాలీవుడ్‌లోకి ఆహ్వానిస్తున్నాం. తెరపై మీ నటనను చూడడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాము’’ అని పేర్కొన్నారు. పలు సామాజిక సమస్యలపై సోషల్‌ మీడియాలో అవగాహన వీడియోలు చేసే నిహారికకు మిలియన్లలో ఫాలోవర్లు, సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:50 AM