నటిస్తూ వేదికపై కూప్పకూలిన నటుడు

ABN , Publish Date - May 14 , 2024 | 12:19 AM

జీవితంలో చివరి క్షణం వరకూ నటిస్తూ ఉండాలని చాలా మంది చెబుతుంటారు. అది మరాఠి నటుడు సతీశ్‌ జోషి విషయంలో నిజమైంది. ఆదివారం ఆయన ముంబైలో రంగోత్సవ్‌ కార్యక్రమంలో...

నటిస్తూ వేదికపై కూప్పకూలిన నటుడు

జీవితంలో చివరి క్షణం వరకూ నటిస్తూ ఉండాలని చాలా మంది చెబుతుంటారు. అది మరాఠి నటుడు సతీశ్‌ జోషి విషయంలో నిజమైంది. ఆదివారం ఆయన ముంబైలో రంగోత్సవ్‌ కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తూ ఉన్నట్లుండి వేదికపై కుప్పకూలారు. ‘ఉదయం నుంచి సతీశ్‌ అలసటతో కనిపించారు. వేదికపై కార్యక్రమం ప్రారంభమైన కొద్ది సేపటికే ఆయన కింద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.’ అని సతీశ్‌ సన్నిహిత మిత్రుడు, సహ నటుడు రాజేశ్‌ దేశ్‌పాండే చెప్పారు. మరాఠి నాటకాలు, టీవీ సీరియల్స్‌, సినిమాల ద్వారా సతీశ్‌ చిరపరిచితుడు. ఆయన మరణంతో ఓ ప్రతిభాశాలిని మరాఠి చిత్ర పరిశ్రమ కోల్పోయిందని చెప్పాలి.

Updated Date - May 14 , 2024 | 01:15 PM