యాక్షన్‌తో నిండిన ఫ్యామిలీ డ్రామా

ABN , Publish Date - May 21 , 2024 | 06:07 AM

శివ కంఠంనేని, శ్రీసూర్య, ప్రియా హెగ్దే, ప్రీతి శుక్లా నటించిన చిత్రం ‘బిగ్‌ బ్రదర్‌’. గోసంగి సుబ్బారావు దర్శకత్వం వహించారు. కె. శివశంకరరావు, ఆర్‌.వెంకటేశ్వరరావు నిర్మించారు...

యాక్షన్‌తో నిండిన ఫ్యామిలీ డ్రామా

శివ కంఠంనేని, శ్రీసూర్య, ప్రియా హెగ్దే, ప్రీతి శుక్లా నటించిన చిత్రం ‘బిగ్‌ బ్రదర్‌’. గోసంగి సుబ్బారావు దర్శకత్వం వహించారు. కె. శివశంకరరావు, ఆర్‌.వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ నెల 24న ‘బిగ్‌ బ్రదర్‌’ విడుదలవుతున్న సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు. దర్శకుడు గోసంగి సుబ్బారావు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా యాక్షన్‌తో నిండిన ఫ్యామిలీ డ్రామా. ఇది సినిమా ప్రేమికులందరినీ అలరిస్తుంది’’ అని చెప్పారు. హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని అన్నారు. నటుడు మురళీ మోహన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధిస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: సంతోశ్‌, కెమెరా: ప్రకాశ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఘంటా శ్రీనివాసరావు.

Updated Date - May 21 , 2024 | 06:07 AM