అమితాబ్‌, కమల్‌, రజనీ.. ఒకే చిత్రంలో

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:30 AM

ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అమితాబ్‌, కమల్‌ హాసన్‌ నటించారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలసి నటించిన చిత్రం ఇదే కావడం గమనార్హం...

అమితాబ్‌, కమల్‌, రజనీ.. ఒకే చిత్రంలో

ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అమితాబ్‌, కమల్‌ హాసన్‌ నటించారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలసి నటించిన చిత్రం ఇదే కావడం గమనార్హం. కమల్‌ నటించిన హిందీ చిత్రాల సంఖ్య తక్కువే. అలాగే అమితాబ్‌ ఏనాడూ తమిళ సినిమాలో నటించింది లేదు. చివరికి తెలుగు చిత్రం ‘కల్కి’ వల్ల వీరిద్దరి కలయిక మరోసారి సాధ్యమైంది. అలాగే అమితాబ్‌ తొలిసారిగా ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం ‘వేట్టయాన్‌’. అందులో హీరో రజనీకాంత్‌. 1991లో వచ్చిన ‘హమ్‌’ చిత్రం తర్వాత వీరిద్దరూ కలసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమితాబ్‌, కమల్‌, రజనీకాంత్‌ కలసి ఓ హిందీ చిత్రంలో నటించారు. 1985లో వచ్చిన ఆ చిత్రం పేరు ‘గిరఫ్తార్‌’.


ఇందులో కమల్‌ హీరో. ఈ సినిమాలో అమితాబ్‌ది మొదట అతిధి పాత్రే. అప్పట్లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో అమితాబ్‌ ఎన్నిక కావడంతో సినిమాలు తగ్గించుకుని రాజకీయాలకు పరిమితం కావాలనుకున్నారు అమితాబ్‌. కానీ దర్శకుడు ప్రయాగ్‌ రాజ్‌ కథ చెప్పి అమితాబ్‌ను ఒప్పించారు. మొదట అతిధి పాత్రే అనుకున్నా క్రమంగా ఆ పాత్ర పరిధి పెరిగి మొయిన్‌ రోల్‌ అయింది. రజనీకాంత్‌ ఈ సినిమాలో అతిధి పాత్ర పోషించారు.

Updated Date - Jun 29 , 2024 | 03:30 AM