సల్మాన్‌ఖాన్‌కు జోడీగా

ABN , Publish Date - May 10 , 2024 | 01:31 AM

‘యానిమల్‌’ చిత్రంతో కథానాయికగా బాలీవుడ్‌లో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు రష్మిక మందన్న. ఇప్పుడు ఆమె మరో హిందీ చిత్రంలో అవకాశం...

సల్మాన్‌ఖాన్‌కు జోడీగా

‘యానిమల్‌’ చిత్రంతో కథానాయికగా బాలీవుడ్‌లో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు రష్మిక మందన్న. ఇప్పుడు ఆమె మరో హిందీ చిత్రంలో అవకాశం అందుకున్నారు. ఏకంగా అగ్రన టుడు సల్మాన్‌ఖాన్‌కు జోడీగా అలరించబోతున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ‘సికందర్‌’ చిత్రంలో రష్మికను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. గురువారం చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది. సల్మాన్‌ఖాన్‌తో నటించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా, గర్వంగా భావిస్తున్నాను అని రష్మిక పేర్కొన్నారు.

Updated Date - May 10 , 2024 | 01:31 AM