ప్రసాదంతో పాటు.. మొక్కలు ఇవ్వండి..

ABN , Publish Date - Oct 09 , 2024 | 01:02 AM

ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్క కూడా భక్తులకు ఇస్తే పచ్చదనాన్ని పెంపొందించవచ్చు అనే షాయాజీ షిండే సూచనను స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ తెలిపారు...

  • డిప్యూటీ సీఎం పవన్‌కు షిండే సూచన

ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్క కూడా భక్తులకు ఇస్తే పచ్చదనాన్ని పెంపొందించవచ్చు అనే షాయాజీ షిండే సూచనను స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ తెలిపారు. మంగళగిరిలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో ప్రముఖ నటుడు షిండే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆలోచనలు విన్నపవన్‌కళ్యాణ్‌ ఇది అభినందనీయమైన ఆలోచన అని కొనియాడారు. ఆయనచేసిన సూచనల అమలుపై సీఎం చంద్రబాబు చర్చిస్తామని చెప్పారు. వృక్షప్రసాద్‌ యోజనను మహారాష్ట్రలో మూడుప్రముఖ ఆలయాల్లో అమలు చేస్తున్నారని షిండే వివరించారు. వాటి విశిష్టతగురించి మరాఠీలో రాసుకున్న కవితను పవన్‌కళ్యాణ్‌కు చదివి వినిపించారు. ఈ కవితనుపవన్‌ కళ్యాణ్‌ప్రశంసిస్తూ ఆ మరాఠీ కవితను తెలుగులోఅనువదించి చెప్పారు.

అమరావతి (ఆంధ్రజ్యోతి)

Updated Date - Oct 09 , 2024 | 01:02 AM