వినోదంతో పాటు సందేశమూ ఉంది

ABN , Publish Date - Oct 04 , 2024 | 01:19 AM

శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘శ్వాగ్‌’ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి హసిత్‌ గోలి దర్శకుడు. విడుదల నేపథ్యంలో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు...

శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘శ్వాగ్‌’ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి హసిత్‌ గోలి దర్శకుడు. విడుదల నేపథ్యంలో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. ‘శ్రీవిష్ణు ఎంటర్‌టైనర్స్‌, కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు చేస్తున్నారు. మా సినిమాలో ఆయన నాలుగు పాత్రలు చేశారు. దాదాపు తొమ్మిది గెటప్ప్‌లో కనిపిస్తారు. వినోదంతో పాటు అద్భుతమైన మెసేజ్‌ ఉంది’ అని చెప్పారాయన. ఇది నాలుగు తరాల కథ అని చెబుతూ ‘దర్శకుడు హసిత్‌ గోలి అందరికీ అర్థమయ్యే రీతిలో స్ర్కీన్‌ప్లే తయారు చేశారు. ఫస్ట్‌ హాఫ్‌లో క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్‌ చేసే విధానం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వెల్‌ తర్వాత మంచి ఎమోషన్‌తో కథ సాగుతుంది. జనరేషన్స్‌లో మారుతూ వస్తున్న జెండర్‌ డామినెన్స్‌ను ఆసక్తికరంగా ప్రజెంట్‌ చేశారు. ఇటువంటి కథని రెండున్నర గంటల్లో చెప్పడం టఫ్‌ జాబ్‌ అయినా దర్శకుడు అద్భుతంగా హ్యాండిల్‌ చేశారు’ అన్నారు విశ్వప్రసాద్‌.


ప్రబాస్‌ నటిస్తున్న ‘రాజాసాబ్‌’ చిత్రం షూటింగ్‌ నవంబర్‌కల్లా పూర్తి చేయాలని భావిస్తున్నామనీ, ఆయన పుట్టిన రోజున కొత్త అప్‌డేట్‌ ఇవ్వాలనుకుంటున్నామనీ ఆయన చెప్పారు. కొత్త ప్రాజెక్ట్స్‌ గురించి చెబుతూ ‘ప్రస్తుతం ‘హరికథ’ అనే ప్రాజెక్ట్‌ చేస్తున్నాం. అది ఓటీటీలో విడుదలవుతుంది. అలాగే ‘న్యూసెన్స్‌ 2’ ను కూడా చేస్తున్నాం. కన్నడంలో డిస్ట్రిబ్యూషన్‌ ప్రారంభించాం. వచ్చే ఏడాది అక్కడ నాలుగు చిత్రాలు తీయాలని ప్లాన్‌ చేస్తున్నాం’ అని చెప్పారు.

Updated Date - Oct 04 , 2024 | 01:19 AM