అల్లు అర్జున్‌ అభినందించారు

ABN , Publish Date - Oct 16 , 2024 | 06:18 AM

‘ఇప్పుడు ప్రేక్షకులు కంటెంట్‌ నచ్చితేనే థియేటర్‌కు వస్తున్నారు. మా సినిమా టీజర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఏదో కొత్త కంటెంట్‌ ఉండబోతోందనే వైబ్‌ క్రియేట్‌ అయింది. మా సినిమా తొలి రోజు షూటింగ్‌కు అల్లు అర్జున్‌ వచ్చి పెద్ద హిట్‌ కావాలని...

‘ఇప్పుడు ప్రేక్షకులు కంటెంట్‌ నచ్చితేనే థియేటర్‌కు వస్తున్నారు. మా సినిమా టీజర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఏదో కొత్త కంటెంట్‌ ఉండబోతోందనే వైబ్‌ క్రియేట్‌ అయింది. మా సినిమా తొలి రోజు షూటింగ్‌కు అల్లు అర్జున్‌ వచ్చి పెద్ద హిట్‌ కావాలని ఆశీస్సులు అందించారు. ఈ నెల 31న చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. పోటీ బాగా ఉంది. అయితే మా సినిమా కొన్న వంశీ నందిపాటికు, మాకు కంటెంట్‌ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే సినిమాను ఆ రోజు విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు హీరో కిరణ్‌ అబ్బవరం. ఆయన నటించిన భారీ పీరియడికల్‌ ఫిల్మ్‌ ‘క’ విడుదల సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. నాలుగు భాషల్లో విడుదలవున్న ఈ సినిమాతో సుజీత్‌, సందీప్‌ దర్శకులుగా పరిచయవవుతున్నారు.


విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాలో జాతర సాంగ్‌ అలరిస్తుందనీ, అలాగే 15 నిమిషాల సేపు ఉండే యాక్షన్‌ సీన్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుందనీ కిరణ్‌ చెప్పారు. ‘70 వ దశకం నేపథ్యంలో ‘క’ సినిమా సాగుతుంది. అభినవ్‌ వాసుదేవ్‌ అనే ఓ పోస్ట్‌మ్యాన్‌ జీవితంలో జరిగే కథ ఇది. స్ర్కీన్‌ప్లే బేస్డ్‌ సినిమా ఇది’ అని దర్శకులు చెప్పారు.

Updated Date - Oct 16 , 2024 | 06:18 AM