Pushpa2 : శ్రీవల్లితో కలసి స్టెప్పులేసిన పుష్ప
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:16 AM
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. పట్నాతో ప్రారంభించి, చెన్నై, కొచ్చిలలో ఈవెంట్స్ నిర్వహించిన చిత్ర యూనిట్ శుక్రవారం ముంబైలో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఇందులో అల్లు అర్జున్, రష్మిక స్టెప్స్ వేసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘నేను హీరోగా నిలబడ్డానంటే కారణం దర్శకుడు సుకుమారే. నన్ను స్టార్‌ని చేసింది ఆయనే. హీరోగా నా ఎదుగుదల లో ఆయన పాత్ర కీలకం. ఈ నిర్మాతలు లేకపోతే ‘పుష్ప’ నిర్మాణం సాధ్యమయ్యేది కాదు. బాలీవుడ్లో విడుదల చేస్తున్న అనిల్ తడాని, భరత్ భూషణ్‌కు ధన్యవాదాలు’ అని చెప్పారు. ఐదు సంవత్సరాల ‘పుష్ప’ ప్రయాణంలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని రష్మిక చెప్పారు. చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 12 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు నవీన్, రవిశంకర్ చెప్పారు.