నేను ఉద్వేగపూరితంగా చేసిన సినిమాలన్నీ హిట్‌

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:38 AM

నా తొలి సినిమా నుంచే వైజాగ్‌తో విడదీయరాని అనుబంధం ఏర్పడిపోయింది. నా 75వ సినిమా ఎమోషనల్‌ మూవీ కావడం ఆనందంగా ఉంది. నేను ఉద్వేగపూరితంగా...

నేను ఉద్వేగపూరితంగా చేసిన సినిమాలన్నీ హిట్‌

నా తొలి సినిమా నుంచే వైజాగ్‌తో విడదీయరాని అనుబంధం ఏర్పడిపోయింది. నా 75వ సినిమా ఎమోషనల్‌ మూవీ కావడం ఆనందంగా ఉంది. నేను ఉద్వేగపూరితంగా నటించిన శత్రువు, ధర్మచక్రం, గణేశ్‌.. ఇలా ప్రతి సినిమా హిట్‌. ఇది కూడా పక్కా హిట్‌’ అని వెంకటేశ్‌ నమ్మకం వ్యక్తం చేశారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకుడు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వైజాగ్‌లో జరిగింది. డైరెక్టర్‌ మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ చూడని కొత్త వెంకటేశ్‌ని ఇందులో చూస్తారు. ఈ సినిమా తర్వాత వెంకీ అభిమానిని అయిపోయాను. వెంకటేశ్‌గారి 75వ సినిమాను దర్శకత్వం చేసే అవకాశం రావడం నా అదృష్టం. అందరం ప్రాణంపెట్టి పనిచేశాం’ అని అన్నారు. ఇంకా చిత్రబృందం పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 01:38 AM