నా నిర్మాతలందరూ హ్యాపీగా ఉండాలి
ABN , Publish Date - Aug 28 , 2024 | 02:37 AM
‘ఇంతకుముందు ప్రమోషన్స్‌కు కూడా సమయం కేటాయించాలనే ఆలోచన ఉండేది కాదు. కంటెంట్ సినిమాను చూసుకుంటుందని అనుకొనేవాణ్ణి. అది నిజమే అయినా సినిమాను ప్రేక్షకుల...
‘ఇంతకుముందు ప్రమోషన్స్‌కు కూడా సమయం కేటాయించాలనే ఆలోచన ఉండేది కాదు. కంటెంట్ సినిమాను చూసుకుంటుందని అనుకొనేవాణ్ణి. అది నిజమే అయినా సినిమాను ప్రేక్షకుల దగ్గరకు చేర్చడం మన బాధ్యత. రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి సినిమా గురించి ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. రెగ్యులర్‌గా ఫాలో కాని వారు, ఇతర పనుల్లో బిజీగా ఉండేవారికి కూడా సినిమా సమాచారాన్ని అందించాలంటే ప్రమోషన్స్ పెద్ద స్థాయిలో చేయాలి. సినిమాను చూడాలనే ఆలోచన వారికి కలిగించాలి’ అన్నారు నాని. ఆయన హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం గురువారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాని మీడియాకు వెల్లడించిన చిత్ర విశేషాలివి.
ఈ సినిమాలో పాయింట్ చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. సాధారణంగా నా సినిమాలన్నింటిలో తెలియని బరువుని నేనే మోస్తుంటాను. కానీ ఈ సినిమాలో ఎస్.జె. సూర్య, వివేక్ ఆ బరువు మోశారు. నేను కొంచెం బ్యాక్‌సీట్ తీసుకున్నా. పెర్ఫార్మెన్స్ పరంగా సూర్య, ప్రియాంక, మురళీశర్మ.. ఇలా అందరిపై భారం ఉంది.
ఈ సినిమాలో సూర్య పోషించిన పాత్రకు ఆయన తప్ప మరో ఛాయిస్ లేదు. అద్భుతంగా నటించారు. నా ప్రతి సినిమాకూ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌లా పని చేస్తాను. నా నిర్మాతలందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. సినిమా రిలీజైన తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారని తెలిస్తే సక్సెస్ అయ్యానని ఫీలవుతా.
ఈ సినిమాకు ‘సరిపోదా శనివారం’ అని పేరు పెట్టడానికి ఎమోషనల్ రీజన్ ఉంది. నా ఫేవరేట్ మూమెంట్ అది. సినిమా ప్రారంభమైన ఐదు నిముషాలకు వస్తుంది. స్ర్కీన్‌ప్లే, నేరేషన్ చాలా ఎక్సయిటింగ్‌గా ఉంటుంది.