త్వరలోనే మీ ముందుకొస్తా అల్కా యాగ్నిక్‌

ABN , Publish Date - Jun 19 , 2024 | 04:10 AM

ప్రఖ్యాత గాయని, జాతీయ అవార్డు గ్రహీత అల్కా యాగ్నిక్‌ ఓ అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దీని గురించి ఆమె వివరణ ఇస్తూ ‘‘కొన్నాళ్లుగా నువ్వు కనిపించడం లేదు ఎందుకని మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు...

త్వరలోనే మీ ముందుకొస్తా అల్కా యాగ్నిక్‌

ప్రఖ్యాత గాయని, జాతీయ అవార్డు గ్రహీత అల్కా యాగ్నిక్‌ ఓ అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దీని గురించి ఆమె వివరణ ఇస్తూ ‘‘కొన్నాళ్లుగా నువ్వు కనిపించడం లేదు ఎందుకని మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అడుగుతున్నారు. ఈ గ్యాప్‌కు కారణం.. నేను ఓ అరుదైన వినికిడి సమస్యతో బాధపడుతున్నాను. చెవికి సోకిన ఓ వైరస్‌ వల్ల ఏర్పడిన ఈ వినికిడి సమస్యను చికిత్సతో నయం చేయవచ్చనే భరోసాను డాక్టర్లు ఇచ్చారు. మీరు కూడా చింతించొద్దు.. ఆందోళన చెందవద్దు. త్వరలోనే నా వినికిడి శక్తిని తిరిగి పొంది.. మీ ముందుకు ఫుల్‌ జోష్‌తో వస్తాను. మీరు కూడా వీలైతే పెద్ద శబ్దాల నుంచి దూరంగా ఉండండి. హెడ్‌సెట్‌ ధరించి ఎక్కువ సౌండ్‌తో పాటలు వినడం తగ్గించండి’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

Updated Date - Jun 19 , 2024 | 04:10 AM