జాకీ భగ్నానికి అండగా అక్షయ్‌ కుమార్‌

ABN , Publish Date - Jul 03 , 2024 | 03:05 AM

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ భర్త, నిర్మాత జాకీ భగ్నానికి బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ అండగా నిలిచారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో రూ.350 కోట్ల రూపాయలతో ‘బడేమియా చోటేమియా’ సినిమాను...

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ భర్త, నిర్మాత జాకీ భగ్నానికి బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ అండగా నిలిచారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో రూ.350 కోట్ల రూపాయలతో ‘బడేమియా చోటేమియా’ సినిమాను జాకీ భగ్నాని, ఆయన తండ్రి వాసు భగ్నానీ నిర్మించారు. అక్షయ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, మానుషి చిల్లర్‌, ఆలయా.ఎఫ్‌ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ.110 కోట్ల రూపాయలు రాబట్టి దారుణ పరాజయంగా మిగిలింది. దీంతో సినిమాకు పని చే సిన వారెవ్వరికీ నిర్మాతలు పూర్తి పారితోషికాన్ని చెల్లించలేకపోయారు. ఈ విషయం బీటౌన్‌లో పెద్ద వివాదంగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్షయ్‌కుమార్‌ తమకు అండగా నిలిచారని జాకీ భగ్నానీ తెలిపారు. ఈ సినిమాకు పనిచేసినవారందరికీ డబ్బులు చెల్లింపులు పూర్తి చేశాకే తనకు ఇవ్వండని.. అలాగే ఈ సంస్ధ నిర్మాణంలో మరోసారి అక్షయ్‌ నటిస్తానని మాటిచ్చినట్లు జాకీ అన్నారు. అక్షయ్‌కు పెద్ద మొత్తం ఇవ్వాల్సి ఉండడంతో.. దానికి కాస్త సమయం దక్కడంతో ఊపిరి పీల్చుకునే వెసులుబాటు దక్కిందని నిర్మాత జాకీ భగ్నానీ భావిస్తున్నారు. ఈ సందర్భాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుని అక్షయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 03 , 2024 | 03:05 AM