శంకరన్‌ నాయర్‌ పాత్రలో అక్షయ్‌ కుమార్‌

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:24 AM

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, దర్శకుడు, నిర్మాత కరణ్‌ జోహార్‌ కాంబినేషన్‌లో మూడో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ కేరళకు చెందిన ప్రముఖ రాజకీయ నేత, బారిస్టర్‌, సంస్కర్త అయిన సి.శంకరన్‌ నాయర్‌....

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, దర్శకుడు, నిర్మాత కరణ్‌ జోహార్‌ కాంబినేషన్‌లో మూడో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ కేరళకు చెందిన ప్రముఖ రాజకీయ నేత, బారిస్టర్‌, సంస్కర్త అయిన సి.శంకరన్‌ నాయర్‌ పాత్రలో నటించనున్నారు. ‘ద కేస్‌ దట్‌ షూక్‌ ద ఎంపైర్‌’ నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. జలియన్‌ వాలా భాగ్‌ మారణకాండ నేపథ్యంలో సాగే చిత్రమిది. కరణ్‌ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ సినిమా పోస్టర్‌ని షేర్‌ చేస్తూ, విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్రానికి కరణ్‌ సింగ్‌ త్యాగి దర్శకత్వం వహించనున్నారు. అక్షయ్‌ కుమార్‌తోపాటు ఆర్‌. మాధవన్‌, అనన్య పాండే నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

Updated Date - Oct 21 , 2024 | 03:24 AM