టాలీవుడ్‌లోకి అక్షయ్‌

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:59 AM

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక తెలుగు చిత్రంలో నటించడం ఆయనకు ఇదే మొదటిసారి...

టాలీవుడ్‌లోకి అక్షయ్‌

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక తెలుగు చిత్రంలో నటించడం ఆయనకు ఇదే మొదటిసారి. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్‌కు వచ్చిన అక్షయ్‌కు డాక్టర్‌ మోహన్‌బాబు, విష్ణు స్వాగతం పలికారు. భారీ అంచనాలతో, నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే న్యూజిలాండ్‌లో రెండు భారీ షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో అక్షయ్‌కుమార్‌ పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రంలో మోహన్‌లాల్‌, ప్రభాస్‌, శరత్‌కుమార్‌, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హై టెక్నికల్‌ స్డాండర్డ్స్‌తో రూపుదిద్దుకుంటున్న ‘కన్నప్ప’ చిత్రానికి ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ ఈ చిత్రానికి రచయితలు. కన్నప్ప కథను అందరికీ తెలిసే విధంగా ఇటీవల కామిక్‌ బుక్స్‌ను విడుదల చేయగా, వాటికి మంచి స్పందన వచ్చింది.

Updated Date - Apr 17 , 2024 | 02:59 AM