వర్క్‌ పూర్తి చేసిన అక్షయ్‌

ABN , Publish Date - May 04 , 2024 | 06:01 AM

డాక్టర్‌ మోహన్‌ బాబు, మోహన్‌లాల్‌, ప్రభాస్‌, శరత్‌కుమార్‌ వంటి మేటి నటులతో రూపుదిద్దుకొంటున్న ‘కన్నప్ప’ చిత్రంలో విష్ణు మంచు టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు...

వర్క్‌ పూర్తి చేసిన అక్షయ్‌

డాక్టర్‌ మోహన్‌ బాబు, మోహన్‌లాల్‌, ప్రభాస్‌, శరత్‌కుమార్‌ వంటి మేటి నటులతో రూపుదిద్దుకొంటున్న ‘కన్నప్ప’ చిత్రంలో విష్ణు మంచు టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కోసం ఇటీవల వచ్చిన బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ తన సన్నివేశాలకు సంబంధించిన వర్క్‌ పూర్తి చేశారు. ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. ‘అక్షయ్‌కుమార్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైంది’ అని పేర్కొన్నారు విష్ణు. ముఖేశ్‌కుమార్‌ దర్శకత్వంలో మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

Updated Date - May 04 , 2024 | 06:01 AM