ఇఫీలో అక్కినేని ఫ్యామిలీ సందడి
ABN , Publish Date - Nov 22 , 2024 | 05:01 AM
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చిత్రోత్సవం(ఇఫీ)లో సందడి చేశారు. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయన నటించిన అజరామర చిత్రాలను...
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చిత్రోత్సవం(ఇఫీ)లో సందడి చేశారు. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయన నటించిన అజరామర చిత్రాలను ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున, అమల దంపతులు బుధవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగచైతన్య, శోభితా గురువారం జంటగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరంతా కలసి రెడ్‌కార్పెట్‌పై ఫొటోలకు పోజులిస్తూ ప్రత్యేకాకర్షణగా నిలిచారు.