త్వరలోనే సెట్స్‌పైకి అఖండ-2

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:00 AM

‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ సినిమాలతో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో హ్యాట్రిక్‌ హిట్స్‌ కొట్టింది. మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించే వీరి కలయికలో మరో చిత్రం ఎప్పుడెప్పుడా...

త్వరలోనే సెట్స్‌పైకి అఖండ-2

‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ సినిమాలతో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో హ్యాట్రిక్‌ హిట్స్‌ కొట్టింది. మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించే వీరి కలయికలో మరో చిత్రం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయమై బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడారు. ‘అఖండ’కు సీక్వెల్‌ ఎప్పుడని నన్ను ఎంతో మంది అడుగుతున్నారు. ప్రస్తుతం ఎటుచూసినా ఎన్నికల హడావుడే కనిపిస్తోంది. కాబట్టి ఎన్నికలు ముగిశాక ఈ సీక్వెల్‌పై అధికారిక ప్రకటన విడుదల చేస్తాం. వీలైనంత త్వరలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాం. ‘అఖండ’లో పసిబిడ్డ, ప్రకృతి, పరమాత్మ అంశాలను చూపించాం. ‘అఖండ-2’లోనూ సమాజానికి అవసరమైన మంచి సందేశాన్ని చూపించబోతున్నాం. దైవత్వం మనందరిలో ఒక భాగం. ఈ విషయాన్ని తెరపైకి తీసుకు వస్తే ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు.

Updated Date - Apr 17 , 2024 | 03:00 AM