సంక్రాంతి బరిలో అజిత్‌ చిత్రం

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:25 AM

తమిళ అగ్రకథానాయకుడు అజిత్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. తెలుగు, తమిళ భాషల్లో పూర్తి వినోదభరితంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి అదిక్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ...

సంక్రాంతి బరిలో అజిత్‌ చిత్రం

తమిళ అగ్రకథానాయకుడు అజిత్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. తెలుగు, తమిళ భాషల్లో పూర్తి వినోదభరితంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి అదిక్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెకండ్‌ లుక్‌ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. అజిత్‌ బ్లాక్‌ షేడ్స్‌ ధరించి , ఖైదీ డ్రస్‌లో కనిపించారు, ఆయన చేతి మీద ఉన్న టాటూ, బ్యాక్‌ గ్రౌండ్‌లో మ్యాసివ్‌ గన్‌ ఫైరింగ్‌ స్టన్నింగ్‌గా ఉన్నాయి. ఈ పోస్టర్‌లోనే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. దీంతో సంక్రాంతి బరిలో మరో చిత్రం చేరనట్లయింది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫొటోగ్రఫీ: అభినందన్‌ రామానుజం, ఎడిటింగ్‌: విజయ్‌ వేలుకుట్టి. ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: దినేశ్‌ నరసింహన్‌, నిర్మాతలు: నవీన్‌ యర్నేని, రవిశంకర్‌.

Updated Date - Jun 28 , 2024 | 04:25 AM