Created Buzz : అజిత్ ఫాస్ట్ బీట్ సాంగ్
ABN , Publish Date - Dec 28 , 2024 | 01:43 AM
అజిత్‌కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విడాముయర్చి’. లైకా ప్రొడక్షన్స్ బేనర్‌పై జి.కె.ఎం.తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.
అజిత్‌కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విడాముయర్చి’. లైకా ప్రొడక్షన్స్ బేనర్‌పై జి.కె.ఎం.తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. అర్జున్, త్రిషా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతోంది. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. దాంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. తాజాగా ఈ మూవీ నుంచి ‘సవదీక’ అనే ఫాస్ట్ బీట్ ఎనర్జిటిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆంఽథోని దాసన్ పాడిన పాటకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు.