అజిత్‌ హీరోగా గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ

ABN , Publish Date - Mar 15 , 2024 | 05:11 AM

తమిళ స్టార్‌ హీరో అజిత్‌కుమార్‌ నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మార్క్‌ ఆంటోని’ ఫేమ్‌ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు...

అజిత్‌ హీరోగా గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ

తమిళ స్టార్‌ హీరో అజిత్‌కుమార్‌ నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మార్క్‌ ఆంటోని’ ఫేమ్‌ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. గురువారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత నవీన్‌ యెర్నేని మాట్లాడుతూ ‘‘స్టార్‌ హీరో అజిత్‌తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్‌ అనుభవాన్ని అందించబోతున్నాం’’ అని అన్నారు. నిర్మాత వై రవిశంకర్‌ మాట్లాడుతూ ’’అధిక్‌ అద్భుత దర్శకత్వ ప్రతిభ అతని మునుపటి చిత్రాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కొత్త చిత్రం నెక్స్ట్‌ లెవల్‌లో వుండబోతుంది’’ అని చెప్పారు. దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ మాట్లాడుతూ ‘’అజిత్‌తో కలిసి పనిచేయటం నా చిరకాల స్వప్నం. ఈ సినిమాతో అది నెరవేరబోతోంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రీకరణ జూన్‌ 2024లో ప్రారంభం అవుతుంది. 2025 సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది.

Updated Date - Mar 15 , 2024 | 05:11 AM