అజర్‌ బైజాన్‌లో అజిత్‌ యాక్షన్‌

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:47 AM

తమిళ హీరో అజిత్‌ కుమార్‌ మరోసారి తనలోని యాక్షన్‌ కోణాన్ని సరికొత్తగా చూపించబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘విడాముయార్చి’ చిత్రం తాజా షెడ్యూల్‌ అజర్‌ బైజాన్‌లో మొదలైంది...

అజర్‌ బైజాన్‌లో అజిత్‌ యాక్షన్‌

తమిళ హీరో అజిత్‌ కుమార్‌ మరోసారి తనలోని యాక్షన్‌ కోణాన్ని సరికొత్తగా చూపించబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘విడాముయార్చి’ చిత్రం తాజా షెడ్యూల్‌ అజర్‌ బైజాన్‌లో మొదలైంది. 45 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో పతాక సన్నివేశాల్లో భాగంగా భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను అక్కడ చిత్రీకరించనున్నారు. మంగళవారం మేకర్స్‌ షూటింగ్‌కు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ప్రమాధకరమైన స్టంట్స్‌లోనూ అజిత్‌ డూప్‌ను వాడడం లేదు అని చిత్రబృందం తెలిపింది. తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయిక. అర్జున్‌ సర్జా, రెజీనా కసాండ్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Jun 26 , 2024 | 05:47 AM