డ్రగ్స్‌కు వ్యతిరేకంగా...

ABN , Publish Date - Apr 10 , 2024 | 01:34 AM

రవికిరణ్‌, త్రిషల, రక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘ఆర్‌ కె పురంలో’ చిత్రం షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. శ్రీకర్‌ ప్రసాద్‌ కట్టా దర్శకత్వంలో గుబ్బల రవికిరణ్‌ నిర్మించిన ఈ చిత్రం...

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా...

రవికిరణ్‌, త్రిషల, రక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘ఆర్‌ కె పురంలో’ చిత్రం షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. శ్రీకర్‌ ప్రసాద్‌ కట్టా దర్శకత్వంలో గుబ్బల రవికిరణ్‌ నిర్మించిన ఈ చిత్రం మే నెలలో విడుదలవుతుంది. చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘నేటి యువత డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాల్ని నాశనం చేసుకుంటోంది. వీరి వల్ల సమాజంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్ని మహిళులు ఎదుర్కొంటున్నారన్నది ఈ చిత్ర కథాంశం’ అని చెప్పారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, సమాజానికి ఉపయోగపడే ఓ పవర్‌ఫుల్‌ పాత్రను హీరో చేశాడని నిర్మాత చెప్పారు.

Updated Date - Apr 10 , 2024 | 01:34 AM