వైజయంతి పాత్రలో మళ్లీ!

ABN , Publish Date - Jun 25 , 2024 | 12:58 AM

విజయతార విజయశాంతి 34 ఏళ్ల క్రితం ‘కర్తవ్యం’ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌ వైజయంతి పాత్రను పోషించారు. ఆ చిత్రం ఆమె నట జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పడమే కాకుండా జాతీయ స్థాయిలో...

వైజయంతి పాత్రలో మళ్లీ!

విజయతార విజయశాంతి 34 ఏళ్ల క్రితం ‘కర్తవ్యం’ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌ వైజయంతి పాత్రను పోషించారు. ఆ చిత్రం ఆమె నట జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పడమే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో విజయశాంతి ‘కర్తవ్యం’ తరహాలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోఫిస్తున్నారు. ఆమె పాత్ర పేరు కూడా వైజయంతి కావడం గమనార్హం. విజయశాంతి పుట్టినరోజు సందర్బంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ద్వారా ఆమె గెటప్‌ రివిల్‌ చేశారు. ఈ పోస్టర్‌తోనే ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో తెలియజేశారు.


అలాగే గ్లింప్స్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ‘వైజయంతి ఐపీఎస్‌.. తను పట్టుకుంటే పోలీస్‌ తుపాకీకే ధైర్యం వస్తుంది.. వేసుకుంటే యూనిఫామ్‌కే పౌరుషం వస్తుంది. తనే ఒక యుద్ధం.. నేనే తన సైన్యం’ అంటూ కల్యాణ్‌రామ్‌ వాయిస్‌ ఓవర్‌తో విజయశాంతి పాన్రు పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో అశోక్‌ వర్థన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు.

Updated Date - Jun 25 , 2024 | 12:58 AM