ఆరేళ్ల తర్వాత మళ్లీ...

ABN , Publish Date - Apr 30 , 2024 | 06:36 AM

‘హే జ్యూడ్‌’ సినిమాతో 2018లో మలయాళంలో అడుగుపెట్టారు త్రిష కృష్ణన్‌. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో బిజీగా ఉండటంతో మలయాళ చిత్రాల్లో త్రిషకు నటించే చాన్స్‌ రాలేదు...

ఆరేళ్ల తర్వాత మళ్లీ...

‘హే జ్యూడ్‌’ సినిమాతో 2018లో మలయాళంలో అడుగుపెట్టారు త్రిష కృష్ణన్‌. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో బిజీగా ఉండటంతో మలయాళ చిత్రాల్లో త్రిషకు నటించే చాన్స్‌ రాలేదు. ఆరేళ్ల తర్వాత మళ్లీ మలయాళంలో త్రిష కృష్ణన్‌ నటిస్తున్న చిత్రం ‘ఐడెంటిటీ’. ‘మిన్నల్‌ మురళీ’, ‘ఆకాశం’, ‘2018’ చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు టోవినో థామస్‌ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ను దర్శక ద్వయం అఖిల్‌ పాల్‌, అనాస్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్నారు. గతంలో ఈ దర్శకులతో టోవినో ‘ఫోరెన్సిక్‌’ అనే చిత్రంలో నటించారు. రాజు మల్లియాత్‌, సెంచురీ కొచుమోత్‌ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా చిత్రీకరణపై దర్శకుడు పాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్‌ ఇచ్చారు. ‘‘సినిమాలో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ముగిసింది. దీంతో సెకండ్‌ షెడ్యూల్‌ పూర్తయింది. షూటింగ్‌ దాదాపు పూర్తయింది, మరికొద్ది రోజుల షూటింగే మిగిలి ఉంది’’ అని పోస్ట్‌ చేశారు.

Updated Date - Apr 30 , 2024 | 06:36 AM