పద్నాలుగేళ్ల తర్వాత మళ్లీ..

ABN , Publish Date - Apr 26 , 2024 | 06:23 AM

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌, దర్శకుడు ప్రియదర్శన్‌ మళ్లీ చేతులు కలిపారు. ‘‘హేరాఫేరి’, ‘భూల్‌ భులయ్య’ చిత్రాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది...

పద్నాలుగేళ్ల తర్వాత మళ్లీ..

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌, దర్శకుడు ప్రియదర్శన్‌ మళ్లీ చేతులు కలిపారు. ‘‘హేరాఫేరి’, ‘భూల్‌ భులయ్య’ చిత్రాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. పద్నాలుగేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఇది కావడం విశేషం. హారర్‌ కామెడీ కథాంశంతో రూపుదిద్దుకొనే ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్‌ నిర్మించనున్నారు. ‘అక్షయ్‌తో సినిమా చేయడం ఎప్పుడూ హ్యాపీనే. ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో చిన్న ఫ్యాంటసీతో సినిమా ఉంటుంది’ అని చెప్పారు ప్రియదర్శన్‌.

Updated Date - Apr 26 , 2024 | 06:23 AM