25 ఏళ్ల తర్వాత మళ్లీ...

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:52 AM

సూపర్‌ హిట్‌ కాంబినేషన్లు ఎప్పుడెప్పుడు రిపీట్‌ అవుతుంటాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. అలాంటి వాటిలో ప్రభుదేవా, ఏ. ఆర్‌. రెహమాన్‌ కలయిక ఒకటి...

25 ఏళ్ల తర్వాత మళ్లీ...

సూపర్‌ హిట్‌ కాంబినేషన్లు ఎప్పుడెప్పుడు రిపీట్‌ అవుతుంటాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. అలాంటి వాటిలో ప్రభుదేవా, ఏ. ఆర్‌. రెహమాన్‌ కలయిక ఒకటి. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ హిట్‌ కాంబో ప్రేక్షకులను పలకరించనుంది. ఇది వీరిద్దరి కలయికలో వస్తున్న ఆరో చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి వర్కింగ్‌ టైటిల్‌ ‘ఏఆర్‌ఆర్‌పీడీ6’. ఎన్‌. ఎస్‌. మనోజ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. యోగిబాబు, అజు వర్ఘీస్‌, అర్జున్‌ అశోకన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో, పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మే నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Mar 24 , 2024 | 02:52 AM