మూడేళ్ల తరవాత..

ABN , Publish Date - Oct 19 , 2024 | 06:22 AM

బాలీవుడ్‌ జంట సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వానీ మూడేళ్ల తరవాత కలిసి ఆన్‌ స్ర్కీన్‌పై కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని ‘మ్యాడ్‌ డాక్‌ ఫిల్స్మ్‌ బేనర్‌పై దినేష్‌ విజన్‌

బాలీవుడ్‌ జంట సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వానీ మూడేళ్ల తరవాత కలిసి ఆన్‌ స్ర్కీన్‌పై కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని ‘మ్యాడ్‌ డాక్‌ ఫిల్స్మ్‌ బేనర్‌పై దినేష్‌ విజన్‌ నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన స్ర్కిప్ట్‌ ఓకే అయినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా, 2021లో విడుదలైన ‘షేర్‌షా’ సినిమాలో సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వానీ తొలిసారిగా కలిసి నటించారు. గతేడాది వీరు వివాహం చేసుకున్నారు. పెళ్లి తరవాత ఇద్దరు కలిసి నటించబోతున్న తొలి చిత్రం ఇదే.

Updated Date - Oct 19 , 2024 | 06:22 AM