పద్దెనిమిదేళ్ల తర్వాత మళ్లీ..

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:18 AM

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ కోసం 13 భారీ సెట్స్‌ వేశారు. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సంస్థ అత్యంత భారీ వ్యయంతో...

పద్దెనిమిదేళ్ల తర్వాత  మళ్లీ..

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ కోసం 13 భారీ సెట్స్‌ వేశారు. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సంస్థ అత్యంత భారీ వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. మెగాస్టార్‌ కెరీర్‌లోనే క్లాస్టీయస్ట్‌ ఫిల్మ్‌ ఇది. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం రకరకాలు పేర్లు వినిపించాయి. అయితే మెగాస్టార్‌ సరసన నటించడం కోసం త్రిషను కథానాయికగా ఎంపిక చేశారు దర్శకనిర్మాతలు. 2006లో ‘స్టాలిన్‌’ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష నటించారు. మళ్లీ పద్దెనిమేదళ్ల అనంతరం ఆమె మెగాస్టార్‌తో కలసి నటిస్తున్నారు. సోమవారం సెట్‌లోకి అడుగుపెట్టిన త్రిష్‌కు చిరంజీవి, దర్శకుడు వశిష్ట, నిర్మాతలు స్వాగతం పలికారు. చాలా గ్రాండియర్‌గా, విజువల్‌ వండర్‌గా రూపుదిద్దుకుంటున్న ‘విశ్వంభర’ చిత్రానికి సంగీతం: కీరవాణి, ఛాయాగ్రహణం: చోటా కె నాయుడు, కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌: సుస్మీత కొణెదల.

Updated Date - Feb 06 , 2024 | 01:18 AM