ఆరేళ్ల విరామం తర్వాత
ABN , Publish Date - Oct 17 , 2024 | 05:41 AM
సీనియర్ నటుడు అర్జున్ ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగా ఫోన్ చేపడుతున్నారు. 2018లో ఆయన దర్శకత్వంలో ఓ తమిళ సినిమా వచ్చింది. ఆ తర్వాత విష్వక్ సేన్ హీరోగా ఓ చిత్రాన్ని...
సీనియర్ నటుడు అర్జున్ ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగా ఫోన్ చేపడుతున్నారు. 2018లో ఆయన దర్శకత్వంలో ఓ తమిళ సినిమా వచ్చింది. ఆ తర్వాత విష్వక్ సేన్ హీరోగా ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో ప్రారంభించారు కానీ అది ఆరంభంలోనే ఆగిపోయింది. తాజాగా ఇప్పుడు ‘సీతా పయనం’ అనే పొయిటిక్ టైటిల్‌తో ఓ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదలవుతుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు.