28 ఏళ్ల తర్వాత...

ABN , Publish Date - Jun 25 , 2024 | 01:01 AM

సరిగ్గా 28 ఏళ్ల క్రితం ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ చిత్రం విడుదలైంది. చిరంజీవి సోదరుడు పవన్‌కల్యాణ్‌కు, ఏయన్నార్‌ మనవరాలు సుప్రియకు ఇదే తొలి సినిమా. ఈవీవీ సత్యనారాయణ దర్శకుడు...

28 ఏళ్ల తర్వాత...

సరిగ్గా 28 ఏళ్ల క్రితం ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ చిత్రం విడుదలైంది. చిరంజీవి సోదరుడు పవన్‌కల్యాణ్‌కు, ఏయన్నార్‌ మనవరాలు సుప్రియకు ఇదే తొలి సినిమా. ఈవీవీ సత్యనారాయణ దర్శకుడు, అల్లు అరవింద్‌ నిర్మాత. ఆ సినిమా తర్వాత హీరోగా ఎదిగి పవన్‌కల్యాణ్‌ పవర్‌స్టార్‌ అయ్యారు. సుప్రియ మాత్రం నటనకు క్రమంగా దూరమై, నిర్మాణరంగంలోకి ప్రవేశించి అక్కడే స్థిరపడ్డారు. సోమవారం ఇతర నిర్మాతలతో పాటు సుప్రియ కూడా పవన్‌కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. కొందరైతే ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ చిత్రంలోని వీరిద్దరి ఫొటోను.. ఇప్పటి ఫొటోను జతచేసి.. సూపర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - Jun 25 , 2024 | 01:01 AM