14ఏళ్ల తర్వాత వేదం కాంబినేషన్‌లో..

ABN , Publish Date - Mar 20 , 2024 | 06:15 AM

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు అనుష్క శెట్టి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 50వ చిత్రం అధికారికంగా ఖరారైంది. ప్రయోగాత్మక చిత్రాలు తీసే క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు...

14ఏళ్ల తర్వాత వేదం కాంబినేషన్‌లో..

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు అనుష్క శెట్టి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 50వ చిత్రం అధికారికంగా ఖరారైంది. ప్రయోగాత్మక చిత్రాలు తీసే క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై వంశీ కృష్ణ రెడ్డి, రాజీవ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రానికి ‘ఘాటి’ అనే టైటిల్‌ను ప్రకటించి, పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. చీరతో ముఖాన్ని కప్పి ఎడారిలో ఒంటరి బాటసారిగా సాగుతున్న అనుష్కను ఇందులో చూపించారు. ఓ మహిళ.. తనకు జరిగిన అన్యాయంపై పోరాడి బయటపడే కథగా ఈ సినిమా తెరకెక్కనుంది. కాగా, క్రిష్‌ దర్శకత్వంలో దాదాపు 14 ఏళ్ల తర్వాత అనుష్క నటిస్తుండటం విశేషం. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వేదం’ విమర్శకుల ప్రశంసలతో పాటు క్లాసికల్‌ హిట్‌ స్టేటస్‌ను సంపాదించుకుంది. అందులో వేశ్యగా నటించిన అనుష్క, ఈ చిత్రంలోనూ అదే పాత్ర పోషించనున్నారని టాక్‌ వినిపిస్తోంది.

Updated Date - Mar 20 , 2024 | 06:15 AM