జాతి కోసం సాహస పోరాటం
ABN , Publish Date - Aug 13 , 2024 | 05:06 AM
తమిళ హీరో సూర్య నటిస్తున్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కంగువ’ అక్టోబర్ 10న విడుదల కానుంది. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్‌ను దర్శకుడు శివ...
తమిళ హీరో సూర్య నటిస్తున్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కంగువ’ అక్టోబర్ 10న విడుదల కానుంది. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్‌ను దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మాతలు. మెస్మరైజింగ్ మేకింగ్‌తో రూపుదిద్దుకుంటున్న ‘కంగువ’ ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. యుద్ధాలు, ఆక్రమణలు చేస్తూ ఎదురొచ్చిన వారిని క్రూరంగా చంపే భయంకరమైన విలన్‌గా బాబీ డియోల్ ఈ ట్రైలర్‌లో కనిపించారు. తన జాతి కోసం, తనవారి కోసం సాహసేపేతమైన పోరాటాలు చేసే ధీరుడిగా సూర్య పాత్ర ఉంది. భారీ నౌకలపై దాడి చేసే సన్నివేశాలు, హై క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు నిలుస్తాయి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో చిత్రం ‘కంగువ’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.