హీరోగా అద్దంకి దయాకర్‌

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:35 AM

కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ సినీ రంగ ప్రవేశం చేశారు.. బొమ్మక్‌ మురళి దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియా ఫైల్స్‌’ చిత్రంలో ఆయన హీరోగా నటించారు...

కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ సినీ రంగ ప్రవేశం చేశారు.. బొమ్మక్‌ మురళి దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియా ఫైల్స్‌’ చిత్రంలో ఆయన హీరోగా నటించారు. ఐదు భాషల్లో తయారవుతున్న ఈ సినిమాకు ఎంఎంకీరవాణి సంగీత దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇంద్రజ, బీఆర్‌ఎస్‌ నాయకుడు దాసోజు శ్రవణ్‌ సహా మరికొందరు రాజకీయ నాయకులు ఇందులో నటించినట్లు తెలుస్తోంది. రాజకీయంగా అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్న తరుణంలో ఈ సినిమా సక్సెస్‌ అయితే ఆయన సినిమాల వైపు వెళతారా, లేక రాజకీయాల్లోనే కొనసాగుతారా అన్నది వేచిచూడాలి.

మోత్కూరు (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jul 11 , 2024 | 04:35 AM