క్రైమ్‌ సస్పెన్స్‌ కలబోతగా

ABN , Publish Date - Aug 12 , 2024 | 03:07 AM

విశ్వంత్‌, శిల్పా మంజునాథ్‌ జంటగా బసిరెడ్డి రానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హైడ్‌ అండ్‌ సీక్‌’. నరేంద్ర బుచ్చిరెడ్డి గారి నిర్మించారు. నటుడు శివాజీ ఈ చిత్రం...

విశ్వంత్‌, శిల్పా మంజునాథ్‌ జంటగా బసిరెడ్డి రానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హైడ్‌ అండ్‌ సీక్‌’. నరేంద్ర బుచ్చిరెడ్డి గారి నిర్మించారు. నటుడు శివాజీ ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక వినూత్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘క్రైమ్‌, సస్పెన్స్‌ అంశాల కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మా సినిమా సమర్పకుడు నవీన్‌ మేడారం ఫస్ట్‌ కాపీ చూసి బావుందని ప్రశంసించారు’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: లిజో కే జోష్‌. సినిమాటోగ్రఫీ: చిన్న రామ్‌

Updated Date - Aug 12 , 2024 | 03:07 AM