భయపెడుతున్న అదా శర్మ

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:43 AM

చాలా రోజుల తర్వాత హీరోయిన్‌ అదా శర్మ తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం పేరు ‘సీడీ’(క్రిమినల్‌ ఆర్‌ డెవిల్‌). కృష్ణ అన్నం దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న ఈ సినిమాను మే 10న...

భయపెడుతున్న అదా శర్మ

చాలా రోజుల తర్వాత హీరోయిన్‌ అదా శర్మ తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం పేరు ‘సీడీ’(క్రిమినల్‌ ఆర్‌ డెవిల్‌). కృష్ణ అన్నం దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న ఈ సినిమాను మే 10న విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో అదా శర్మ యాక్షన్‌ సీక్వెన్స్‌, భయపెట్టే చూపులతో ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్‌ ఫీలవుతారు. ట్రైలర్‌లో విజువల్స్‌, రీరికార్డింగ్‌ .. అద్భుతంగా ఉన్నాయి. విశ్వంత్‌, ‘జబర్దస్త్‌’ రోహిణి, భరణీశంకర్‌, రమణ భార్గవ్‌, మహేశ్‌ విట్టా ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: ముద్దుకృష్ణ, సినిమాటోగ్రఫీ: సతీశ్‌ ముత్యాల ,సంగీతం: ఆర్‌.ఆర్‌. ధ్రువన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: గిరిధర్‌.

Updated Date - Apr 29 , 2024 | 06:43 AM