నటి హీనాఖాన్‌కు కేన్సర్‌

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:28 AM

ప్రముఖ బాలీవుడ్‌ బుల్లితెర నటి హీనాఖాన్‌ రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నారు. శుక్రవారం ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ‘ప్రస్తుతం స్టేజ్‌ 3 కేన్సర్‌తో...

నటి హీనాఖాన్‌కు కేన్సర్‌

ప్రముఖ బాలీవుడ్‌ బుల్లితెర నటి హీనాఖాన్‌ రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నారు. శుక్రవారం ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ‘ప్రస్తుతం స్టేజ్‌ 3 కేన్సర్‌తో పోరాడుతున్నాను. చికిత్స తీసుకుంటున్నాను. కేన్సర్‌ను జయించి మళ్లీ మామూలు మనిషిగా మీ ముందుకు వస్తాననే నమ్మకం ఉంది. ఈ ఆపత్కాలంలో నాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. బుల్లి తెర సీరియల్‌ ‘ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై’లో అక్షర పాత్రతో ఆమె ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘బిగ్‌బాస్‌, ఖత్రోన్‌ కే ఖిలాడి’ వంటి రియాలిటీ షోల్లో హీనాఖాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2024 | 03:28 AM