Divi: సముద్రతీరంలో దివి సోయగాలు, ఫోటోస్ వైరల్

ABN , Publish Date - Mar 21 , 2024 | 12:47 PM

దివి లో పుట్టల్సింది దారి తప్పి భువి లో పుట్టినవే నువ్వు, ఇది ఒక నెటిజెన్ నటి దివి పోస్ట్ చేసిన ఫోటోలపై చేసిన కామెంట్. దివి తన సామాజిక మాధ్యమంలో బీచ్ లో తీసుకున్న ఫోటోలను పెడితే, అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి

Divi: సముద్రతీరంలో దివి సోయగాలు, ఫోటోస్ వైరల్
Actress Divi

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన తరువాత నటి దివికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి దివికి ప్రసంశలు ఇవ్వటమే కాకుండా, బిగ్ బాస్ షో ఫైనల్ కి ప్రత్యేక అతిధిగా హాజరయి దివికి తన చిత్రంలో ఒక మంచి పాత్ర ఇస్తాను అని అన్నారు. తాను అన్నమాటకి తిరుగులేదని అందుకు తన సినిమా 'గాడ్ ఫాదర్' లో దివికి ఒక మంచి పాత్ర కూడా ఇచ్చారు.

divibeachone.jpg

ఆ సినిమా తరువాత దివి చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఈమధ్యనే విడుదలైన 'లంబసింగి' అనే సినిమాలో కథానాయిక పాత్ర పోషించింది. ఈ సినిమా అరకు దగ్గర వున్న లంబసింగి గ్రామ నేపథ్యంలో వచ్చిన సినిమా. ఇందులో దివి ఆ వూర్లో ప్రజలందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ, సహాయం చేస్తూ, ప్రజల తరపున ప్రశ్నిస్తూ తన తండ్రితో అదే వూర్లో జీవనం సాగించే పాత్ర.

divibeachtwo.jpg

అదే వూరికి కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అయిన ఒక అబ్బాయి దివిని చూసిన మొదటి క్షణంలోనే ప్రేమించేస్తాడు, ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆమె సాధారణ యువతి, ఆమె ఆ వూర్లో ప్రజలకి తన వంతు సాయం చేస్తూ, ముఖ్యంగా వైద్యంలో అక్కడ ఆసుపత్రిలో సేవలు చేస్తూ ఉంటుంది అనుకుంటాడు.

divibeachthree.jpg

ఆ కానిస్టేబుల్ పనిచేస్తున్న ఆ వూరు పోలీసు స్టేషన్ పై ఒకరోజు నక్సలైట్స్ వచ్చి దాడిచేసి స్టేషన్ లో వున్న తుపాకులను పట్టుకొని పారిపోతారు. అప్పుడు డ్యూటీలో లో ఆ కుర్ర కానిస్టేబుల్ వాళ్లలో దివి ఉండటం చూసి షాకవుతాడు. సాధారణంగా, మామూలుగా కనిపించే యువతీ ఒక నక్సలైట్ అని తెలుసుకొని, అతను ఏమి చేసాడు, చివరికి ఏమైంది అనేది ఆ సినిమా కథాంశం.

Divi Vadthya Glamour Photos

దివి పాత్రలో రెండు వైవిధ్యమైన కోణాలున్నాయి. ఈ సినిమాలో ఆమె మేకప్ ఏమీ లేకుండా నటించడమే కాకుండా, తన నటనతో అందరినీ మెప్పించింది, ప్రశంశలు కూడా పొందింది. ముఖ్యంగా నక్సలైట్ గా దివి చేసిన పాత్ర అందరినీ మెప్పిస్తుంది. క్లైమాక్స్ లో ఆమె తన తండ్రితో మాట్లాడే సన్నివేశాలు అందరినీ మెప్పిస్తాయి.

divivaditya.jpg

కథానాయికగా ఎదిగిన దివికి ఈ 'లంబసింగి' సినిమాతో ఇంకా మంచి పాత్రలు వస్తాయని అనుకుంటున్నారు. ఆమె ఒక్క నటనలోనే కాకుండా, అందంలో కూడా తాను తీసిపోనని చెపుతూ వుంది. అందుకు ఉదాహరణ ఆమె తన సాంఘీక మాధ్యమంలో పెట్టిన తన ఫోటోలు. సాగర తీరంలో తన అందాలను ప్రదర్శిస్తూ వున్న ఫోటోలను ఆమె పోస్ట్ చేసింది.

Divi Vadthya Glamour Photos

ఆ ఫోటోలకి నెటిజన్స్ కామెంట్స్ కూడా బాగా ఇస్తున్నారు. ఒక నెటిజెన్ అయితే 'దివి లో పుట్టల్సింది దారి తప్పి భువి లో పుట్టినవే నువ్వు' అని ఒక కామెంట్ పెట్టారు. దివి చీరలో తన అందాలను సముద్ర తీరంలో ప్రదర్శించిన ఫోటోలను అభిమానుల కోసం పెట్టారు, అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Updated Date - Mar 21 , 2024 | 12:49 PM