మీడియా ముందుకెళ్లొద్దు
ABN , Publish Date - Sep 09 , 2024 | 05:20 AM
లైంగిక వేధింపుల గురించి నటీనటులు మీడియా ముందుకు వెళ్లొద్దని నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ కళాకారుల సంఘం)లోనే ఫిర్యాదు చేయాలని ఆ సంఘం ఆధ్వర్యంలో లైంగిక వేధింపులపై
లైంగిక వేధింపుల గురించి నటీనటులు మీడియా ముందుకు వెళ్లొద్దని నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ కళాకారుల సంఘం)లోనే ఫిర్యాదు చేయాలని ఆ సంఘం ఆధ్వర్యంలో లైంగిక వేధింపులపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన విశాఖ కమిటీ అధ్యక్షురాలు, నటి రోహిణి సూచించారు. ఇటీవల మాలీవుడ్‌లో హేమకమిటీ సృష్టించిన కలకలం నేపథ్యంలో నడిగర్ సంఘంలో అలాంటి సంచలనాలకు తావుండకూడదని ఆమె పేర్కొన్నారు.
ఐదేళ్ల నిషేధం..
ఆదివారం జరిగిన నడిగర్ సంఘం సర్వసభ్యమండలి సమావేశంలో లైంగిక వేధింపుల ఆరోపణకు గురైన నటులపై ఐదేళ్ల నిషేధం విధించాలని తీర్మానించారు. ఈ తీర్మానాన్ని సినీ నిర్మాతల సంఘానికి కూడా ప్రతిపాదించారు. లైంగిక వేధింపులకు గురయ్యే బాధితులు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి నడిగర్ సంఘం అండగా ఉంటుందని తీర్మానంలో పేర్కొన్నారు. బాధితులు ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ కూడా ఏర్పాటు చేసినట్లు నడిగర్ సంఘం పేర్కొంది. - చెన్నై(ఆంధ్రజ్యోతి):