నటుడు చారుహాసన్‌కు అస్వస్థత

ABN , Publish Date - Nov 02 , 2024 | 07:04 AM

లెజండరీ నటుడు, 93 యేళ్ళ చారుహాసన్‌ అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఆపరేషన్‌ చేయనున్నట్టు ఆయన కుమార్తె, సినీ నటి సుహాసిని మణిరత్నం ఓ వీడియో

చెన్నై, (ఆంధ్రజ్యోతి) : లెజండరీ నటుడు, 93 యేళ్ళ చారుహాసన్‌ అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఆపరేషన్‌ చేయనున్నట్టు ఆయన కుమార్తె, సినీ నటి సుహాసిని మణిరత్నం ఓ వీడియో సందేశంలో వెల్లడించారు. అగ్రనటుడు కమల్‌ హాసన్‌కు స్వయానా అన్న అయిన చారుహాసన్‌ను గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు వృద్ధాప్య సమస్యలు వేధిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన ఉన్నట్టుండి గురువారం అస్వస్థతకు లోనుకావడంతో నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే తన తండ్రికి చిన్నపాటి ఆపరేషన్‌ చేయనున్నారని, ఇందుకోసం ఆయన సిద్ధమవుతున్నారని పేర్కొంటూ ఆస్పత్రి పడకపై ఉన్న తన తండ్రితో కలిసి దిగిన ఒక ఫోటోను సుహాసిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Updated Date - Nov 02 , 2024 | 07:04 AM