యాక్షన్‌ షో రీల్‌

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:44 AM

రవితేజ, దర్శకుడు హరీశ్‌శంకర్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా షో రీల్‌ను సోమవారం విడుదల చేశారు. ఎలాంటి డైలాగులు లేకపోవడం...

యాక్షన్‌ షో రీల్‌

రవితేజ, దర్శకుడు హరీశ్‌శంకర్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా షో రీల్‌ను సోమవారం విడుదల చేశారు. ఎలాంటి డైలాగులు లేకపోవడం ఈ రీల్‌ ప్రత్యేకత. పాత్రలను పరిచయం చేస్తూ ఆసక్తికరంగా ఇది ఉంది. రవితేజ స్టైలిష్‌, మాస్‌ క్యారెక్టర్‌లో కనిపించారు. ఆయన గెటప్‌ క్లాస్‌టచ్‌తో ఉంది. ఆయన పాల్గొన్న యాక్షన్‌ సీన్లు మాస్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. జగపతిబాబు ఓల్డ్‌ ఫెరోషియస్‌ మ్యాన్‌గా కనిపించారు. రీల్‌ చివరిలో రవితేజ అమితాబ్‌ బచ్చన్‌ను ఇమిటేట్‌ చేసే సీన్‌ ఆసక్తికరంగా ఉంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సచిన్‌ ఖేడ్కర్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. వీరిద్దరూ కూడా షో రీల్‌లో కనిపించారు. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తామని చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ చెప్పారు. ‘నామ్‌తో సునా హో గా’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్‌, ఫొటోగ్రఫీ: ఆయనంక బోస్‌, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

Updated Date - Jun 18 , 2024 | 03:44 AM