యాక్షన్‌ ప్యాక్డ్‌ మూవీ

ABN , Publish Date - Jun 02 , 2024 | 02:20 AM

వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు నాట అభిమానులను సంపాదించుకున్నారు తమిళ హీరో విజయ్‌ ఆంటోని. ఇప్పుడు ఆయన ‘తుఫాన్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు...

యాక్షన్‌ ప్యాక్డ్‌ మూవీ

వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు నాట అభిమానులను సంపాదించుకున్నారు తమిళ హీరో విజయ్‌ ఆంటోని. ఇప్పుడు ఆయన ‘తుఫాన్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం ఇటీవలే టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ ‘తుఫాన్‌’ యాక్షన్‌ ప్యాక్డ్‌ మూవీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’ అన్నారు. దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ మాట్లాడుతూ ‘‘తుఫాన్‌’ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం. ఒక దీవిలో జరిగే కథ ఇది. హీరో క్యారెక్టరైజేషన్‌ సరికొత్తగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది’ అని చెప్పారు. ఈ చిత్రాన్ని కమల్‌ బోరా, డి. లలిత నిర్మిస్తున్నారు. సంగీతం: అచ్చు రాజమణి, విజయ్‌ ఆంటోని.

Updated Date - Jun 02 , 2024 | 02:20 AM