యాక్షన్‌ ఊచకోత

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:54 AM

విశాల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రత్నం’ ఈ నెల 26న విడుదల కానుంది. హరి దర్శకత్వంలో కార్తికేయన్‌ సంతానం నిర్మించారు. ఈ సినిమాను సీహెచ్‌ సతీశ్‌ కుమార్‌, కె. రాజ్‌కుమార్‌...

యాక్షన్‌ ఊచకోత

విశాల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రత్నం’ ఈ నెల 26న విడుదల కానుంది. హరి దర్శకత్వంలో కార్తికేయన్‌ సంతానం నిర్మించారు. ఈ సినిమాను సీహెచ్‌ సతీశ్‌ కుమార్‌, కె. రాజ్‌కుమార్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఏపీ, తమిళనాడు సరిహద్దు గొడవల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. హీరోయిన్‌ కోసం హీరో చేసే ఊచకోత మాస్‌ యాక్షన్‌ జానర్లు ఇష్డపడే ప్రేక్షకులను అలరిస్తుంది. యాక్షన్‌తో పాటు లవ్‌ సీన్లకు కూడా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ మంచి రీరికార్డింగ్‌ ఇచ్చారు.

Updated Date - Apr 17 , 2024 | 02:54 AM