మారేడుమిల్లిలో యాక్షన్‌

ABN , Publish Date - Jan 07 , 2024 | 02:57 AM

వరుస విజయాలతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌కేసరి చిత్రాలతో హ్యాట్రిక్‌ కొట్టిన బాలయ్య సిక్సర్‌పై కన్నేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా ...

మారేడుమిల్లిలో యాక్షన్‌

వరుస విజయాలతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌కేసరి చిత్రాలతో హ్యాట్రిక్‌ కొట్టిన బాలయ్య సిక్సర్‌పై కన్నేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా కె.ఎ్‌స.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో ఎస్‌.నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ మారేడుమిల్లి ఫారె్‌స్టలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణ, ప్రధాన తారాగణంపై యాక్షన్‌ సన్నివేశాలను దర్శకుడు బాబీ చిత్రీకరిస్తున్నారు. సీనియర్‌ నటి ఊర్వశి కూడా షూటింగ్‌లో భాగమయ్యారు. మరో రెండుమూడు రోజుల్లో ఈ షెడ్యూల్‌ పూర్తి కానున్నట్టు మేకర్స్‌ తెలిపారు. బాలకృష్ణ కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని భిన్నమైన పాత్రను ఇందులో చేస్తున్నారని, కథ, కథనం, సినేరియా కొత్తగా ఉంటుందని, అభిమానులు పండుగ చేసుకునేలా బాలకృష్ణ కేరక్టరైజేషన్‌ ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. బాబీడియోల్‌ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Jan 07 , 2024 | 02:57 AM