యాక్షన్‌ ఎంటర్టైనర్‌

ABN , Publish Date - May 01 , 2024 | 05:45 AM

‘బేబి’తో సూపర్‌ హిట్‌ కొట్టిన తర్వాత ఆనంద్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘గం గం గణేశా’. ఈ యాక్షన్‌ ఎంటర్టైనర్‌కు ఉదయ్‌ శెట్టి ద

యాక్షన్‌ ఎంటర్టైనర్‌

‘బేబి’తో సూపర్‌ హిట్‌ కొట్టిన తర్వాత ఆనంద్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘గం గం గణేశా’. ఈ యాక్షన్‌ ఎంటర్టైనర్‌కు ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కేదార్‌ శెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. మే 31న ఈ సినిమా విడుదల కానుంది. సరికొత్త కంటెంట్‌తో ఈ చిత్రం రాబోతోందని పోస్టర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిశోర్‌, జబర్దస్త్‌ ఇమ్మాన్యూయల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - May 01 , 2024 | 05:45 AM